Sanjiv Khanna | తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా.. ప్రమాణస్వీకారం అప్పుడే..!

-

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా(Sanjiv Khanna) నియమితలయ్యారు. సీజేఐ చంద్రచూడ్ సక్సెసర్‌గా సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టనున్నారు. నవంబర్ 10న చంద్రచూడ్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన సీజేఐగా సంజీవ్ ఖన్నా.. ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన పేరును ప్రస్తుత సీజేఐ చంద్రచూడ్ కూడా సిఫార్సు చేశారు. దీంతో సంజీవ్ ఖన్నా నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో నవంబర్ 11న సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ(CJI)గా సంజీవ్ ఖన్నా.. 13 మే 2025 వరకు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ వెల్లడించారు.

- Advertisement -

ఎవరీ Sanjiv Khanna

1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న సంజీవ్ ఖన్నా.. 18 జనవరి 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తీస్‌హజారీ జిల్లా కోర్టు, మైకోరటు, ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో ఢిల్లీ హైకోర్టులోనే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన ప్రస్తుతం జాతీయ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, భోపాల్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ పాలక మండలి సభ్యుడిగా కూడా ఉన్నారు. మరికొన్ని రోజుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Read Also: ఆర్మీ వెహికల్‌పై ఉగ్రదాడి.. నలుగురు మృతి
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Best Face Mask | తెల్లని చర్మం కోసం తేలికైనా చిట్కాలు..

అందం ఎవరి సొంతం కాదు. కానీ కొందరు మాత్రం తెల్లగా ఉంటేనే...

Terror Attack | ఆర్మీ వెహికల్‌పై ఉగ్రదాడి.. నలుగురు మృతి

Terror Attack | జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రదాడులు రెచ్చిపోయారు. ఆర్మీ వాహనాలను...