ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వాఖ్యాలు చేశారు…. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయని ఆయన మండిపడ్డారు…
తాజాగా జైలు నుంచి విడుదల అయిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పరామర్శించారు… ఆతర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ…. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన చూస్తుంటే హిట్లర్ పాలనను తలపిస్తుందని జగన్ కుటుంబ చరిత్ర అందరికి తెలుసని అన్నారు…
జగన్ ఒక ఫ్యాక్షనిస్ట్ అని మండిపడ్డారు… ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు… వైసీపీలో 80 శాతం మంది మంత్రులు 60 శాతం మంది ఎమ్మెల్యే నేర చరిత్ర కలవారని అన్నారు…