ట్రైలర్ 2లో జగన్ తన పదవికి రాజీనామా….

ట్రైలర్ 2లో జగన్ తన పదవికి రాజీనామా....

0
116

విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సంచలనమైన చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే వర్మ సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే…. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…

తాజాగా వర్మ మరో ట్రైలర్ ను విడుదల చేశారు… ఈ ట్రైలర్ లో హఠాత్తుగా జరిగిన ఎవ్వరూ ఊహించని రాజకీయ పరిణామాలతో పిచ్చెక్కిపోయి తన మనుగడకే ముప్పొచ్చిందన్న నిస్పృహలో పడిపోయారు ఓడిపోయిన పార్టీకి సంబంధించిన తండ్రీ కొడుకులు అంటూ ప్రారంభం అయిన ఈ ట్రైలర్ లో ఇలాంటి వాతావరణంలో ఇంకో ఐదేళ్లు కష్టమే అప్పటికి మీకు 75 సంవత్సరాలు వస్తాయి…

ఈలోగా మన పార్టీని ఆ పొట్టోడు లాగేసుకుపోతే అన్న డైలాగులు ఉన్నాయి… అలాగే పవన్ కళ్యాణ్ ప్రచారం… కేఏ పాల్ కూడా కనిపిస్తారు… ఈట్రైలర్ కొన్న క్రైం సీన్స్ కూడా కనిపిస్తాయి… అలాగే జగన్ తన పదవికి రాజీనామా చేసినట్లు మీడియాకు ప్రకటిస్తారు…