IPL 2025 | ‘పంత్ విషయంలో వారిదే తుది నిర్ణయం’

-

ఐపీఎల్(IPL 2025) మెగా వేలంకు వేళయింది. ఇందులో అందరి దృష్టి రిషబ్ పంత్‌(Rishabh Pant)పైనే ఉంది. రిషబ్‌ను ఏ జట్టు సొంతం చేసుకుంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ విషయంపై అనేక ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రిషబ్ కోసం సీఎస్‌కే(CSK), ఆర్‌సీబీ(RCB), పంజాబ్(Punjab Kings) జట్లు పోటీ పడుతున్నాయని, భారీ మొత్తంలో వెచ్చించడం కోసం కూడా ఈ మూడు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఢిల్లీకి సారథ్యం వహించిన రిషబ్‌ను ఎందుకనో ఆ టీమ్ రీటైన్ చేసుకోలేదు. దీంతో రిషబ్.. మెగా వేలంలో తన పేరును నమోదు చేయించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో అదరగొట్టిన రిషబ్.. టెస్ట్ సిరీసుల్లో కూడా తన మార్క్ చూపించుకున్నాడు. దీంతో రిషబ్‌ను సీఎస్‌కే సొంతం చేసుకోనుందని వార్తలొస్తున్నాయి. తాజాగా వీటిపై సీఎస్‌కే ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించారు.

- Advertisement -

IPL 2025 | ‘‘రిషబ్ పంత్ అద్భుతమైన ప్లేయర్. ఈసారి మెగా వేలంలోకి అడుగుపెట్టాడు. మా ఫ్రాంచైజీ అతడిని సొంతం చేసుకుంటుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఈ విషయాన్ని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(Ruturaj Gaikwad)తో పాటు ధోనీ(MS Dhoni), కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌(Stephen Fleming)తో కూడా చర్చించాం. పంత్‌ను తీసుకోవడంలో ఈ ముగ్గురిదే తుది నిర్ణయం. గత కొన్నేళ్లుగా సీఎస్‌కే నిలకడగా రాణించడానికి జట్టులోని సభ్యులే ప్రధాన కారణం. వచ్చే ఏడాది కూడా అత్యుత్తమ జట్టుతోనే ఐపీఎల్ బరిలోకి దిగుతాం’’ అని చెప్పారాయన.

Read Also: అలా జరిగితే చంపేయాలన్నంత కోపం వస్తుంది: ధావన్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dust Allergy | డస్ట్ అలెర్జీ ఇబ్బంది పెడుతుందా..? ఈ చిట్కాలు మీకోసమే..

డస్ట్ అలెర్జీ(Dust Allergy) అనేది చాలా సాధారణ సమస్య. కానీ చాలా...

IPL Auction 2025 | ఐపీఎల్ వేలం.. ఎవరు ఎంత పలికారంటే..

ఐపీఎల్ వేలం(IPL Auction 2025) మొదలైంది. ఇందులో భారత ఆటగాడు రిషబ్...