జగన్ కు షాక్… వైసీపీ ఎంపీలు పక్క చూపులు

జగన్ కు షాక్... వైసీపీ ఎంపీలు పక్క చూపులు

0
116

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పక్క చూపులు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లడుతూ… సంచలన వ్యాఖ్యలు చేశారు…

గత ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ ఎంపీలపై ఇంత త్వరగా పట్టు కోల్పోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు… వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే పడవ వంటిదని దేవినేని అన్నారు…

ప్రస్తుత ప్రభుత్వంలో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయని అన్నారు… ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు పక్క చూపులు చూస్తున్నారని ఇక రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు నెక్ట్స్ ముఖ్యమంత్రి ఎవరని చర్చించుకుంటున్నారని అన్నారు…

జగన్ సొంత పార్టీ ఎంపీల విషయంలో ఇంత త్వరగా పట్టు కోల్పోతారని ఎవ్వరు ఊహించలేదని ఇదే విషయాన్ని హస్తినలో కూడా చర్చించుకుటున్నారని దేవినేని అన్నారు…