ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడటానికి టీమిండియా రెడీ అవుతోంది. కాగా ఈ జట్టుకు రోహిత్(Rohit Sharma) దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రోహిత్ శర్మ జట్టుకు దూరమైతే కెప్టెన్ ఎవరు? ఓపెనర్ ఎవరు? అనేది ఇంకా తేలలేదు. తాజాగా ఈ విషయంపై గంభీర్ స్పందించాడు. రోహిత్ లేని సమయంలో టీమిండియాకు బుమ్రా(Jasprit Bumrah) కెప్టెన్సీ వహిస్తాడని, అదే విధంగా రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా రాహుల్(KL Rahul) బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని గంభీర్(Gautam Gambhir) చెప్పాడు. ఇప్పటికే ఈ విషయాలపై ఒక ఆలోచన చేసి ఉన్నామని, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని రోహిత్ చెప్పుకొచ్చాడు.
అయితే ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) టెస్ట్ సిరీస్ ఈ నెల 22న ప్రారంభం కానుంది. అదే సమయంలో రోహిత్ భార్య తన రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జట్టు పరిస్థితులపై గంభీర్(Gautam Gambhir) స్పందించాడు. ‘‘ట్రోఫీకి రోహిత్ అందుబాటులో ఉంటాడు ఉండడు అనేది ఇంకా స్పష్టత లేదు. ఏదైనా అతి త్వరలోనే తెలుస్తుంది. అతను ఆడతాడన్న ఆశతో ఉన్నాం. ఒక వేళ రోహిత్ అందుబాటులో లేకుంటే వైస్ కెప్టెన్‌గా ఉన్న బుమ్రా.. జట్టు బాధ్యతలను చేపడతాడు. ఓపెనింగ్ కోసం రాహుల్, ఈశ్వరన్ ప్రత్యామ్నాయాలుగా ఉన్నారు. మ్యాచ్ సమయానికి తుది నిర్ణయం తీసుకుంటాం. అనుభవం, నాణ్యతను బట్టి ఆటగాడిని ఎంచుకుంటాం. ఎక్కువగా రాహుల్‌కే అవకాశం ఉంది’’ అని గంభీర్ వివరించాడు.