ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మహిళల భద్రతపై సీఎం చంద్రబాబు(Chandrababu) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లో ఎన్‌డీఏ(NDA) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చేపట్టిన పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు తవ్వే కొద్దీ వస్తున్నాయని, ఒక్కో ఇటుకా పేరుస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. మహిళల భద్రత(Women Safety) విషయంలో తమ ప్రభుత్వం చాలా కఠినం వ్యవహరిస్తుందని చెప్పారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కాదు ఆ ఆలోచన చేస్తే భయపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
‘‘గత ప్రభుత్వ పాలనలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రాజకీయ నాయకులను కూడా నిర్వీర్యం చేయాలని యత్నించారు. ఆడబిడ్డల జోలికొస్తే వదిలి పెట్టే ప్రసక్తే లేదు. అత్యంత కఠిన చర్యలు తీసుకుంటాం. ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్దార్. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టి ప్రజల్లో అవగాహన తీసుకొస్తాం. డ్రగ్స్‌పై పిల్లలకు కూడా అవగాహన తెస్తాం. ఇది ఏ ఒక్కరి బాధ్యతో కాదు ప్రతి ఒక్కరి బాధ్యత. భూకబ్జాలకు కూడా చెక్ పెడతాం’’ అని సీఎం చంద్రబాబు(Chandrababu) వ్యాఖ్యానించారు.