బంగ్లాదేశ్(Bangladesh) వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దారుణ దాడులపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు కొణిదెల పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. వీటిని వెంటనే ఆపే దిశగా చర్యలు చేపట్టాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యానస్‌కు విజ్ణప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్(Chinmoy Krishna Das)ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై కలిసికట్టుగా పోరాడదామంటూ పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా జరుగుతున్న దాడులను తనను ఎంతగానో కలచివేస్తున్నాయని, బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భారత సైన్యం ప్రాణాలు త్యాగం చేసిందని, రక్తాలు చిందించిందని గుర్తు చేశారు పవన్. వారికి ప్రత్యేక దేశం కల్పించడం కోసం భారత్ తన దేశ వనరులను ఖర్చు చేయడంతో పాటు తన వీరుల ప్రాణాలను కూడా పణంగా పెట్టిందని అన్నారు.
ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్(YS Jagan)కు అదానీ(Adani) అందించిన ముడుపులపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ పాలనలో అనేక అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు Pawan Kalyan.