ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్(AR Rahman) విడాకుల తర్వాత తొలిసారి బహిరంగ సభలో పాల్గొన్నారు. గోవా వేదికగా జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) ముగింపు వేడుకలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం అనేక మంది ఎదుర్కొంటున్న డిప్రెషన్‌పై మాట్లాడారు. శారీరక అవసరాలపై శ్రద్ధ చూపడం మానుకోవాలని సూచించారు.
ఈ రోజుల్లో చాలా మంది డిప్రెషన్‌కు గురవుతున్నారని, అందుకు జీవితంలో ఏదో ముఖ్యమైనదాన్ని కోల్పోయామనే బాధే కారణమని వివరించారు. ఆ గొప్ప లోటు వల్ల జీవితమే శూన్యంలా మారిందనే భ్రమలో వారు జీవిస్తున్నారని, దాన్ని ఎదుర్కోవడం ఎవరికీ అంతుకిచ్చడం లేదని చెప్పారు. అలాంటి సందర్భాల్లో చదవడం, రాయడం, మనకు నచ్చిన సంగీతం వినడం వంటిని మనసుకు స్వాంతన కలిగిస్తాయని చెప్పారు.
‘‘నేను యవ్వనంలో ఉన్న సమయంలో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. కానీ దాని నుంచి బయటపడి ఇప్పుడు మీముందు ఇలా ఉన్నాను. ఆ సమయంలో మా అమ్మ నాకు ఓ అద్భుతమైన సలహా ఇచ్చింది. మనం ఇతరుల కోసం జీవించినప్పుడు ఆత్మహత్య వంటి ఆలోచనలు రావని. అప్పటి నుంచి నా ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది.
నేను నా జీవితంలో అందుకున్న అత్యంత అందమైన, గొప్ప సలహా అదే. అప్పుడు మా నోటి వెంట వచ్చిన ఆ మాటలు జీవితానికి లోతైన అర్థాన్ని ఇచ్చాయి. మానసిక ఆరోగ్య సవాళ్లను అధిగమించడంలో సహాయపడ్డాయి’’ అని రెహ్మాన్(AR Rahman) వెల్లడించారు.