గన్నవరంలో రాజకీయం మరింత హీట్ పుట్టిస్తోంది.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన వంశీ ఇక త్వరలో రాజకీయంగా వైసీపీలో చేరనున్నారు.. ఇక ఆ పార్టీలో ఉన్న యార్లగడ్డ దీనిపై ఎలా స్పందిస్తారు అని అందరూ భావించారు.. అయితే రెండు రోజుల క్రితం సీఎంతో ఆయన భేటీ అయ్యారు, మొత్తానికి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని హామీ ఇచ్చారు.. అలాగే వంశీకి మళ్లీ టికెట్ ఇస్తాను అని అన్నారు.
దీంతో వంశీ కూడా తాను వెంకట్రావుతో కలిసి పనిచేస్తాను అన్నారు.. అయితే ఇక్కడ మరో మెలిక కూడా ఉంది.. పరిస్దితులు తారుమారు అవ్వకుండా చూడాలి అని కోరారట వెంకట్రావు… వంశీ రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చిన తర్వాత, తనకు ప్రయారిటీ ఎక్కడా తగ్గకూడదు అని అన్నారు యార్లగడ్డ.. అయితే ఇండివిడ్యువల్ కేడర్ కాకుండా , పార్టీ కోసం ఇద్దరు పనిచేయాలని జగన్ కూడా తెలియచేశారట.. దీంతో ఇద్దరితో విడివిడిగా చర్చలు జరిపి ఇద్దరికి హామీ ఇచ్చారు అని తెలుస్తోంది.