ఆస్ట్రేలియా, భారత్ రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ నెల 6 నుంచి ఈ టెస్ట్ మొదలవుతుంది. తొలి టెస్ట్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ(Rohit Sharma).. ఈ రెండో టెస్ట్‌తో జట్టులోకి తిరిగి వస్తున్నాడు. తన భార్య డెలివరీ డేట్ ఉండటంతో తొలి టెస్ట్‌లో ఆడకుండా ఇండియాలోనే ఉండిపోయాడు రోహిత్. తన భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిన రోహిత్.. రెండో టెస్ట్‌లో జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.
దీంతో అడిలైడ్ వేదికగా జరిగే టెస్ట్‌లో ఎప్పటిలానే రోహిత్ ఓపెనర్ ఆడనున్నాడని అంతా భావించారు. కానీ ఈ టెస్ట్‌లో రోహిత్.. ఓపెనర్ కాదట. తొలి టెస్ట్‌లో ఓపెనింగ్ చేసిన యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal), కేఎల్ రాహుల్(KL Rahul) జోడీ బాగా రాణించింది. దీంతో రెండో టెస్ట్‌లో కూడా ఈ జోడీ చేతే ఓపెనింగ్ చేయించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందని సమాచారం.
పెర్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఫెయిల్ అయిన యశస్వి.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో అదరగొట్టాడు. అదే విధంగా తొలి ఇన్నింగ్స్‌లో కష్ట సమయంలో వికెట్ పడకుండా ఎంతో చాకచక్యంగా రాణించడంలో రాహుల్ తన అనుభవాన్ని చూపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా రాహుల్ 77 పరుగులు చేసి తన మార్క్ చూపించుకున్నాడు. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌లో కూడా వీరిద్దరి చేతే ఓపెనింగ్ చేయించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట.
అదే విధంగా మరోవైపు శుభ్‌మన్ గిల్(Shubman Gill) కూడా అందుబాటులోకి రానున్నాడు. ఈ క్రమంలో గిల్.. మూడో స్థానంలో ఆడనున్నాడు. తొలి మ్యాచ్‌లో ఈ స్థానంలో రాణించిన దేవదత్ పడిక్కల్.. రెండో టెస్ట్‌లో ఆడకపోవచ్చు. దీంతో నాలుగో స్థానంలో కోహ్లీ(Virat Kohli), ఐదో స్థానంలో రోహిత్ శర్మ(Rohit Sharma) ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.