కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Paidi Rakesh Reddy) మండిపడ్డారు. కోమటి.. దక్షిణ, ఉత్తర తెలంగాణలో పిచ్చి వాగుడు వాగుతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy)కి ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. దమ్ముంటే పోటీకి రావాలంటూ సవాల్ చేశారు. తప్పతాగి తిక్కతిక్కగా మాట్లాడటం కాదని, దమ్ముంటే వాస్తవాలు, ఉన్నవి మాట్లాడాలంటూ విమర్శలు గుప్పించారు.
అంతేకాకుండా కొడకా, అరే, ఏరా అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేవించి అలా మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని, అతనిపై ఎంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
ఇంతకీ రాకేష్(Paidi Rakesh Reddy) ఏమన్నారంటే.. ‘‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడే పిస్స ఎంకడు. మధ్యాహ్నం తాగే కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చిండు. నన్ను కాదని ఓడిపోయిన మనిషిని తీసుకొచ్చి ఎమ్మెల్యే పరిచయం చేయడానికి ఎవడివిరా నువ్వు. నీకు డబ్బు ఎక్కువ ఉంటే మడిచి దగ్గర పెట్టుకో కొడకా. కోమటిరెడ్డి అనే పేరు వల్ల బతికిపోయావ్ కొడకా.
కొడకా నువ్వు నల్లగొండలో రాజీనామా చెయ్యి నేను నిజామాబాద్ జిల్లాలో రాజీనామా చేస్తా పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో. నీకు బాగా బలుపు ఉంది మడిచి పెట్టుకో. దక్షిణ తెలంగాణ నుండి ఉత్తర తెలంగాణలో పిచ్చి వాగుడు వాగుతున్నాడు’’ అని ధ్వజమెత్తారు పైడి రాకేష్ రెడ్డి.