Golden Temple | గోల్డెన్ టెంపుల్‌లో గన్ షాట్స్.. మాజీ సీఎం టార్గెట్..

-

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌(Golden Temple)లో కాల్పులు కలకలం రేపాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌(Sukhbir Singh Badal) టార్గెట్‌గా ఈ కాల్పులు జరిగాయి. సుఖ్‌బీర్.. సేవాదార్‌గా శిక్ష అనుభవిస్తున్న క్రమంలో ఈ కాల్పులు జరిగాయి. ఆయనపై కాల్పులు జరిగిన గుర్తు తెలియని వ్యక్తులను కనుగొనడం కోసం అధికారులు గాలింపు చేపట్టారు.

- Advertisement -

తన శిక్షలో భాగంగా చక్రాల కుర్చీలో ఆలయ ప్రవేశద్వారం దగ్గర సుఖ్‌బీర్ కాపలాదారుగా ఉన్నారు. ఆయన సమయంలోనే ఓ వృద్ధుడు ఆయన దగ్గరకు వచ్చాడు. కొన్ని అడుగుల దూరంలో ఉన్నప్పుడు ఒక్కసారి తన జేబు నుంచి తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అది గమనించిన సుఖ్‌బీర్ వ్యక్తిగత సిబ్బంది వెంటనే దాడిని అడ్డుకుని సుఖ్‌బీర్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.

Golden Temple | అంతేకాకుండా కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్న భద్రతా సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో సుఖ్‌బీర్‌కు ఎటువంటి హానీ జరగలేదు. నిందితుడిని నరైన్ సింగ్ చౌరాగా పోలీసులు గుర్తించారు. అతడు గతంలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే ఉగ్రముఠాలో పనిచేసినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.

Read Also: హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి సోమవారం..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...