GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

-

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా చేశారు. ఈమేరకు తన రాజీనామా లేఖను సీఎం నారా చంద్రబాబు నాయుడుకు(Chandrababu) పంపించారు. ఏపీ ఫైబర్ నెట్(Fibernet) ఛైర్మన్ పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికారి ప్రతినిధి పదవి నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగత కారణాలతో, నేను తెలుగు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హెూదా, మరియు ఏపీ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ చైర్మన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను. మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగు దేశం పార్టీ(TDP) మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తి లో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు’’ అని ఆయన(GV Reddy) తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Read Also: ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...

Nitish Kumar | రాజకీయాల్లోకి బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనయుడు..?

బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar)...