కృష్ణా జిల్లా మచిలీపట్నం(Machilipatnam) గిలకలదిండి వద్ద మత్స్యకారులకు జాక్‌పాట్ తగిలినట్లయింది. చేపల వేటకు వెళ్లిన వారికి భారీ చేపచిక్కింది. దీని బరువు 1500 కిలోల వరకు ఉంటుందని వారు చెప్తున్నారు. దీనిని క్రేన్ సహాయంతో బయటకు తీశామని, దీనిని చూడటానికి స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు వస్తున్నారని మత్స్యకారులు చెప్పారు. ఈ చేపను చెన్నైకి చెందిన వ్యాపారస్తులు భారీ మొత్తానికి కొనుగోలు చేశారని కూడా మత్స్యకారులు చెప్పారు.