Andhra Pradesh |ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రసుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. శుక్రవారం అర్థరాత్రి ఏకంగా 39మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయనే చర్చ మరింత జోరందుకుంది. ఒకేసారి అంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమకు కావాల్సిన అధికారులను మార్చుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. సాధారణ బదిలీల్లో భాగంగానే బదిలీలు చేశామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బదిలీ అయిన వారిలో చాలా మంది సీనియర్ అధికారులు ఉన్నారు.
Read Also: ప్రధాని మోదీ పర్యటనతో హైదరాబాద్ లో వేడెక్కిన రాజకీయాలు
Follow us on: Google News, Koo, Twitter