చంద్రబాబుకి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ 

-

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఐడీ కస్టడీ పిటిషన్ పై తీర్పును విజయవాడ ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉన్న దృష్ట్యా తీర్పు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే తీర్పు వాయిదా వేస్తామని, క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అమరావతి రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై శుక్రవారం విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు వెల్లడించింది.

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో చంద్రబాబును విచారించేందుకు ‘పోలీసు కస్టడీ’కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తరపున సీనియర్ న్యాయవాదులు బుధవారం వాదించారు. అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చాలని కోరారు. పోలీసు కస్టడీ పేరుతో విచారణ చేసి, ఆ వివరాలను ఎంపిక చేసుకున్న ఛానళ్ల ద్వారా ప్రచారం చేసి ప్రజల్లో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలనే లక్ష్యంతో దర్యాప్తు సంస్థ వ్యవహరిస్తోందన్నారు.

అడిషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్పెషల్ పీపీ వివేకానంద సీఐడీ తరఫున వాదనలు వినిపించారు. అరెస్టు అనంతరం పూర్తిస్థాయిలో విచారించడానికి తగిన సమయం లేదన్నారు. పోలీసు కస్టడీలో విచారణ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. విచారణకు సహకరించాలని ఇద్దరికి నోటీసు ఇస్తే విదేశాలకు వెళ్లిపోయారని, షెల్ కంపెనీలకు మళ్లించిన ప్రజాధనం ఎవరికి చేరింది అనేది ఇంకా తేల్చాల్సి ఉందని చెప్పారు. ఇది రూ.371 కోట్ల ప్రజాధనం వ్యవహారం అన్నారు. వాస్తవాలు వెలికి తీయాలంటే పోలీసు కస్టడీలో విచారణ అవసరం అన్నారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉన్నందున ఏసీబీ కోర్టు తీర్పును గురువారం నుంచి శుక్రవారానికి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...