వైసీపీ నేత విడదల రజిని(Vidadala Rajini), సీనియర్ ఐపీఎస్ అధికారి పి. జాషువా(IPS Jashuva), మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక రాతి వ్యాపారి నుంచి రూ.2.2 కోట్లకు పైగా డబ్బు వసూలు చేశారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో విజిలెన్స్ రైడ్స్ పేరు చెప్పి డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా ఎడ్లపాడులో స్టోన్ క్రషింగ్ బిజినెస్ మ్యాన్ నుండి రజిని(Vidadala Rajini) అనుచరుడు ఎ డి రామకృష్ణ రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. తర్వాత ఒక నెల రోజులకు విడదల రజిని, జాషువా పథకం ప్రకారం… వ్యాపారి ప్రాపర్టీస్ పై జాషువా అనధికార రైడ్స్ జరిపారు. అనంతరం సదరు వ్యాపారి నుంచి లంచంగా రూ.2.20 కోట్లు తీసుకున్నారు. లంచం, నేరపూరిత కుట్ర, బెదిరింపులకు పాల్పడినందుకు అవినీతి నిరోధక చట్టం (పిసిఎ)లోని సెక్షన్లు 7, 7 ఎ, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 384, 120 బి కింద ఏసీబీ కేసు నమోదు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు విడదల రజిని మొదటి నిందితురాలిగా.. జాషువా ఏ 2గా, రజిని భర్త వి గోపి ఏ 3గా, రామకృష్ణ ఏ 4గా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.