యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆదిపురుష్(Adipurush) సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్ నటించింది. రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు. ప్రభాస్ సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి ఏరియా భీమవరం(Bhimavaram), ఏలూరులో సినిమా దియేటర్స్ వద్ద అయితే ప్రభాస్ అభిమానులు.. దియేటర్స్ వద్ద ప్లెక్సీలు, కాషాయ జెండాలతో జై శ్రీరామ్ అంటూ నినాదాలతో సందడి చేస్తున్నారు. ఇక భీమవరంలోని ఒక ప్రభాస్ అభిమాని.. ప్రభాస్ లా రాముడు వేషధారణతో రథంపై భీమవరం(Bhimavaram) రోడ్లపై ఊరేగుతూ సందడి చేశాడు. ఇదిలా ఉండగా.. కొన్ని థియేటర్స్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు సత్యనారాయణ థియేటర్ స్క్రీన్ వన్‌లో సినిమా స్టార్ట్ అయిన 30 నిమిషాల వరకు వాయిస్ రాకపోవడంతో అభిమానుల ఆందోళన చేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం ప్రదర్శన నిలిపివేసి టెక్నికల్ సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Also:
1. ఆదిపురుష్ చూసిన హనుమంతుడు.. ఇదిగో సాక్ష్యం (వీడియో)
2. బేబీ పుట్టాక మావయ్య వాళ్లతో కలిసి ఉంటాం: ఉపాసన
Follow us on: Google News, Koo, Twitter, ShareChat