Alapati Rajendra Prasad | ఈ కీచకపాలన ఎవరికోసం జగన్మోహన్ రెడ్డి?

-

వైసీపీ సర్కార్, సీఎం జగన్‌పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్(Alapati Rajendra Prasad) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సీఎం జగన్‌ హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దుర్మార్గాలకు నెలవుగా మార్చాడని మండిపడ్డారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక అత్యాచారాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉండటం బాధాకరమని ఆవేదన చెందారు. గత ప్రభుత్వం తో పోల్చిచూస్తే శాంతిభద్రతల నిర్వహణ ఈ ప్రభుత్వంలో ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందని వెల్లడించారు. జగన్ పరిపాలన(Jagan Governance) దోచుకోవడం దాచుకోవడానికే తప్ప, ప్రజల్ని కాపాడటానికి కాదని తేలిపోయిందన్నారు. రాష్ట్రంలో ఐదు నిమిషాలకో అత్యాచారం, పది నిమిషాలకో అఘాయిత్యం, అరగంటకో హత్య జరుగుతున్నదని, ఈ కీచక పాలన దేనికోసం ఎవరికోసం జగన్మోహన్ రెడ్డి? అని నిలదీశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన అసాంఘిక కార్యకలాపాలతో పోలిస్తే, నేడు జగన్ జమానాలో జరిగే దారుణాలు, దుశ్చర్యల్లో రాష్ట్రం చాలా గొప్ప పురోగతి సాధించిందని ఆలపాటి(Alapati Rajendra Prasad) అన్నారు.

- Advertisement -
Read Also:
1. వాహనదారులకు శుభవార్త.. త్వరలోనే చమురు ధరలు తగ్గింపు
2. పవన్ కల్యాణ్ ఎవర్‌గ్రీన్ సినిమా ట్రైలర్‌ విడుదల (వీడియో)

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...