పసుపుమయమైన బెజవాడ.. లోకేష్ పాదయాత్రకు అంతా సిద్ధం

-

Vijayawada | విజయవాడలో జరగనున్న టీడీపీ యువనేత లోకేశ్ పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు వైసీపీ నాయకులు యత్నిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న(Buddha Venkanna) ఆరోపించారు. సీఎం జగన్ దేవినేని అవినాశ్ కుటుంబ సభ్యులను పరామర్శించడం వెనుక కుట్ర ఉందన్నారు. అవినాశ్‌ను రెచ్చగొట్టడానికే జగన్ ఆయన ఇంటికి వెళ్లారన్నారు. మరోసారి అవినాశ్‌ని బలిపశువుని చేసే పనిలో జగన్ ఉన్నారని తెలిపారు. గన్నవరం సభతో పాటు లోకేష్ పాదయాత్రలో అల్లర్లు సృష్టించడానికి అవినాష్ ఇంటికెళ్లారని పేర్కొన్నారు. . ఢీ అంటే ఢీ అనే విధంగా తాము కూడా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా లోకేష్‌(Nara Lokesh)కి బెజవాడలో వినూత్నరీతిలో స్వాగతం పలుకుతామని బుద్దా వెల్లడించారు.

- Advertisement -

లోకేష్‌ పాదయాత్ర సందర్భంగా ప్రకాశం బ్యారేజ్ పసుపు మయమైంది. లోకేష్‌కు స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు భారీగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాలు లోకేష్ ఫ్లెక్సీలు బ్యానర్లతో నిండిపోయింది. మూడు రోజులపాటు ఈ ఉమ్మడి కృష్ణ జిల్లాలో లోకేష్‌ పాదయాత్ర చేస్తారని టీడీపీ నేతలు తెలిపారు. ఈనెల 22న గన్నవరంలో వేలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా చర్యలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.

మరోవైపు విజయవాడ(Vijayawada)లో అనధికారికంగా ఉన్న ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, కటౌట్స్‌ను తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వకుండా ఉత్తర్వులు జారీ చేశారని టీడీపీ(TDP) ఆరోపిస్తుంది. అనుమతులు ఇచ్చినా.. ఇవ్వకపోయినా ఫ్లెక్సీలు కట్టి తీరతామంటూ వెల్లడించారు.

Read Also: నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.20వేల వేతనంతో ఉద్యోగాలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

అమరావతికి కొత్త రైల్వే లైన్.. ప్రకటించిన జీఎం అరుణ్

Amaravati | ఏపీకి సంబంధించి 73 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు దక్షిణ...

డిశ్చార్జ్ అయిన రజనీ.. షూటింగ్ అప్పటి నుంచే..

సూపర్ స్టార్ రజనీకాంత్(RajiniKanth) తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు....