పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)-మెగా హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) కాంబినేషన్‌లో వచ్చిన బ్రో సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలైన తొలిరోజే దాదాపు రూ.50 కోట్ల వరకు కొల్లగొట్టిదంటే పవర్ స్టార్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అయితే, విడుదలైన తొలిరోజే ఈ చిత్రాన్ని వివాదాలు వెంటాడుతున్నాయి. సినిమాలో ప్రముఖ కమెడియన్ 30ఇయర్స్ పృథ్వీ చేసిన డ్యాన్స్ గతేడాది సంక్రాంతి సంబురాల్లో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) చేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేశాడని వైసీపీ శ్రేణులు, మంత్రి అభిమానులు మండిపడుతున్నారు.
తాజాగా.. దీనిపై మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) స్పందించారు. ‘బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పెట్టి దూషించారని విన్నాను. కానీ, నేను ఇంతవరకు చూడలేదు. శునకానందం పోందే పరిస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయారని విమర్శించారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాలు చాలా చూశానని.. తాను పెద్ద సినిమా పిచ్చోడినని అన్నారు. అలాగే ఒక సినిమాలో నటించారు కదా అంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు…‘‘నేను పూర్తిగా నటిస్తే వారు కంగారు పడతారు’’ అంటూ అంబటి రాంబాబు వెరైటీగా సమాధానం ఇచ్చారు.