కోడెల బలవన్మరణానికి కారణం అదే.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

-

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు(Kodela Siva Prasada Rao) ఆత్మహత్యకు చంద్రబాబే కారణమని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) సంచలన ఆరోపణలు చేశారు. గురువారం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అన్నివిధాలా సహాయం చేసిన కోడెల శివప్రసాద్‌ను అక్కున చేర్చుకోవాల్సింది పోయి.. చంద్రబాబు అవమానించారని విమర్శించారు. ఓ వైపు కుటుంబసభ్యులు, మరోవైపు పార్టీ నుంచి కూడా సహకారం అందకపోవడంతోనే కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారని అన్నారు. కోడెల శివప్రసాద్ 1983లో ఎన్టీఆర్‌తో టీడీపీలో ఉన్నారని గుర్తుచేశారు.

- Advertisement -

టీడీపీలో ఎన్ని రాజకీయ సంక్షోభాలు వచ్చినా .. పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారే తప్ప మారలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే అనర్హత వేటు వేయకుండా స్పీకర్‌గా కాకుండా రాజకీయ నేతగా చంద్రబాబుకు సాయం చేయలేదా అని ప్రశ్నించారు. అందులో నలుగురు మంత్రులు చేసినా మిన్నకుండిపోయారని గుర్తుచేశారు. ఫర్నీచర్ అంశానికి సంబంధించి వర్ల రామయ్యతో చంద్రబాబు వ్యాఖ్యలు చేయించలేదా అని నిలదీశారు మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu). చంద్రబాబు చేసే నీచ రాజకీయాలను చూసిన కోడెల శివప్రసాద్ కుంగిపోయారన్నారు.

Read Also: కాంట్రాక్టర్ విజయ్ సూసైడ్ పై స్పందించిన RSP

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...