వైసీపీలో చేరి వారం రోజులు కూడా కాలేదు. అంతలోనే రాజీనామా ప్రకటన చేశారు అంబటి రాయుడు(Ambati Rayudu). ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా శనివారం పోస్టును పెట్టారు. రాయుడు చేసిన ఈ ప్రకటన రాజకీయ దుమారం రేపింది. తాను కోరిన స్థానంలో టికెట్ ఇస్తానని చెప్పి జగన్ వంచించారని, అందుకే ఆయన వారం తిరగకుండానే పార్టీకి రాజీనామా చేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి. సొంత పార్టీ నేతలు సైతం ఇదే నిజమని భావించాయి. రెండు రోజులుగా ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర ట్వీట్ చేశారు అంబటి రాయుడు.
ఈ ట్వీట్ తో వైసిపికి రాజీనామా పై క్లారిటీ వచ్చినట్లు అయింది. “నేను అంబటి రాయుడు.. జనవరి 20 నుంచి దుబాయ్ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ టి20 కి ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈ ప్రొఫెషనల్ క్రీడలో ఆడటానికి.. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం ఉండకూడదు” అని తన ట్వీట్ లో పేర్కొన్నారు రాయుడు. కాగా ఆయన చేసిన ట్వీట్ తో ILT20 లో ఆడేందుకే రాజకీయాల నుంచి తప్పుకున్నారు అని క్లారిటీ ఇచ్చారు రాయుడు(Ambati Rayudu). దీంతో ఆయనపై వస్తున్న విమర్శలకు పరోక్షంగా చెక్ పెట్టేశారు క్రికెటర్ అంబటి రాయుడు.