ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మాజీ టీమిండియా ప్లేయర్ అంబటి రాయుడు(Ambati Rayudu) మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వీరు ఇరువురు భేటీ అయ్యారు. ఇటీవల ఐపీఎల్‌లో సాధించిన ట్రోఫీని సీఎం జగన్‌కు చూపించారు. దీంతో కప్ గెలిచిన టీమ్‌లో కీలక పాత్ర సోషించిన రాయుడిని జగన్(Jagan) అభినందించారు. ఏపీలో క్రీడారంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి అంబటి రాయుడు వివరించారు. క్రీడారంగంపట్ల పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇటీవల ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సీఎస్‌కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్, అంబటి రాయుడు(Ambati Rayudu) చూపించారు.