టీమిండియా మాజీ క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కామన్. ఇప్పటికే నవజ్యోత్ సిద్ధూ, అజారుద్దీన్, గౌతమ్ గంభీర్, మనోజ్ తివారీ లాంటి వారు రాజకీయాల్లోకి వచ్చి పదవులు కూడా చేపట్టారు. ఇప్పడు ఈ కోవలోకి ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) చేరబోతున్నాడని తెలుస్తోంది. ఇటీవల తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు రాయుడు ప్రకటించాడు. బీఆర్ఎస్ పార్టీలో చేరతాడని కొందరు.. టీడీపీలో చేరతారని మరికొందరు ప్రచారం చేశారు.
అయితే తాజాగా రాయుడు(Ambati Rayudu) చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. గత బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్(CM Jagan) ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని వైసీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దానిని రీట్వీట్ చేసిన రాయుడు.. ‘మనందరి అభిమాన సీఎం జగన్ గారి గొప్ప ప్రసంగం.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మీ మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి సార్’ అని పోస్ట్ చేశాడు. దీంతో రాయుడు కచ్చితంగా త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నాడని ప్రచారం జోరందుకుంది.
Great speech ..our chief minister@ysjagan garu.. everyone in the state has complete belief and trust in you sir.. https://t.co/gw4s1ek1LR
— Ambati Rayudu (@RayuduAmbati) April 19, 2023
Read Also: పొలిటీషియన్స్, సెలబ్రెటీలు, క్రికెటర్లకు షాక్ ఇచ్చిన ట్విట్టర్
Follow us on: Google News, Koo, Twitter