మధ్యంతర బడ్జెట్‌కు ఏపీ కేబినెట్(AP Cabinet) ఆమోదం.. కీలక నిర్ణయాలు ఇవే..
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ఓటాన్ బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
AP Cabinet నిర్ణయాలు ఇవే..
నంద్యాల జిల్లా డోన్‌లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటుకు ఆమోదం. వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ కింద పనిచేయనున్న పాలిటెక్నిక్ కాలేజీ.
డోన్‌లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కాలేజీ ద్వారా వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమో కోర్సు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ కింద పనిచేయనున్న కాలేజీ.
అన్నమయ్య జిల్లాలో అన్నమాచార్య యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
ఏపీ ప్రైవేట్ యూనివర్శిటీస్ యాక్ట్ 2016కి సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో ఈ మూడు యూనివర్శిటీల ఏర్పాటుకు అనుమతి.
ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ఆమోదం