ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ(AP Cabinet) సమావేశంలో బుధవారం సుదీర్ఘంగా సాగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఏపీ నూతన మద్యం పాలసీ కూడా ఒకటి. దాదాపు ఆరు రాష్ట్రాల్లోని ఎక్సైజ్ పాలసీలను అధ్యయనం చేసి రూపొందించిన మద్యం పాలసీకి ఈరోజు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పాలసీ ద్వారా సామాన్యుడికి సరసమైన ధరలకే నాణ్యమైన మద్యం లభిస్తుందని క్యాబినెట్ వెల్లడించింది. ఈ కొత్త పాలసీ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని క్యాబినెట్ నిశ్చయించింది. ప్రతి ఒక్కరికి నాణ్యమైన మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని, మద్యం ధర సగటున రూ.99 నుంచి ఉండాలని నిర్ణయించారు. దీంతో పాటుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది క్యాబినెట్. అందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేయాలన్న నిర్ణయం కూడా ఉంది.
AP Cabinet తీసుకున్న నిర్ణయాలు..
పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సీడబ్ల్యూసీ సూచనల మేరకు పాత ఏజన్సీకే ఇవ్వాలని నిర్ణయం. ఒకే ఏజెన్సీకే పనులు కేటాయించడం వల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలు తలెత్తినా ఏజెన్సీ బాధ్యత ఉంటుందని అభిప్రాయపడిన మంత్రివర్గం
ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ‘స్టెమీ’ పథకం ప్రారంభం.
ఆధార్ తరహాలో విద్యార్థులకు ‘అపార్’ గుర్తింపు కార్డులు
హోంశాఖలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు.. కొత్త కార్పొరేషన్కు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్
వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖాల్లో కలిపేలా చర్యలు