CM Jagan | రేపు కేసీఆర్‌ను పరామర్శించనున్న సీఎం జగన్‌

-

ఏపీ సీఎం వైఎస్ జగన్‌(CM Jagan) రేపు(గురువారం) హైదరాబాద్‌కు రానున్నారు. ఇటీవల ఫామ్‌హౌస్‌లో గాయపడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)ను పరామర్శించనున్నారు. గత నెల కేసీఆర్ కాలుజారి కిందపడటంతో సోమాజిగూడ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు తుంటి మార్పిడి చికిత్స చేశారు. వారం రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు.

- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆసుపత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాత్రం పరామర్శించకపోవడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్‌ను జగన్‌(CM Jagan) పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

Read Also: సిట్టింగ్‌లకు షాక్.. వైసీపీ కొత్త ఇంఛార్జ్‌ల రెండో జాబితా విడుదల..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...