వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

-

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు.

- Advertisement -

“నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, రాజమండ్రి వాసులందరికీ నమస్కారాలు, గోదావరి నదీ తల్లికి ప్రణామం చేస్తున్నాను ఆదికవి నన్నయ నడయాడిన నేల ఇది… ఇక్కడే ఆయన తెలుగులో తొలి కావ్యాన్ని రచించారు. ఇప్పుడు ఈ గడ్డ నుంచి కొత్త చరిత్ర ప్రారంభం కానుందని నాకు స్పష్టంగా తెలుస్తోంది” అని మోదీ వివరించారు.

“వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడింది. ప్రజలారా… మీకు గుర్తుండే ఉంటుంది… వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పింది. మరి ఇన్నేళ్లలో ఒక్క రాజధాని అయినా కట్టారా? మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేసే ప్రయత్నంలో ఉండగా, ఈ ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. వీళ్లు అవినీతిని మాత్రమే చేయగలరు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అనేది ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలియనే తెలియదు. ప్రజలకు సేవ చేయాలన్న కోరిక లేని ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి.

పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ జీవనాడికి బ్రేక్ వేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు. నేడు ఏపీ రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. రైతులకు మద్దతు ధర లభించడంలేదు. జూన్ 4 తర్వాత ఏపీలో ఎన్డీయే(NDA) ప్రభుత్వం వచ్చాక, ఇటువంటి సమస్యలన్నీ దూరం చేస్తుంది. మే 13న మీ ఓటుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి యాత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే విజయం తథ్యం. ఏపీ అసెంబ్లీలోనూ కూటమి ప్రభుత్వం రాబోతుంది” అని మోదీ(PM Modi) వెల్లడించారు.

Read Also: జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

యానిమల్ బ్యూటీ తృప్తి మోసం చేసిందా…! ఆమె టీమ్ ఏమంటోందంటే..

యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ అయిపోయిన బ్యూటీ తృప్తి డిమిత్రి(Tripti Dimri)....

మైగ్రేన్ తలనొప్పి వస్తుందా.. వీటిని ట్రై చేయండి..

మైగ్రేన్(Migraine).. ఈ కాలంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. కుర్రవాళ్లు...