ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Govt) మరో నాలుగు కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం ఇటీవలే రజక, కొప్పుల వెలమ, గవర, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కార్పొరేషన్లకు 60 మంది డైరెక్టర్లను నియమించింది. ఒక్కో కార్పొరేషన్ కు 15 మంది డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ సభ్యులతోపాటు ప్రతి కార్పొరేషన్ లో ఇద్దరు జనసేన సభ్యులకు, ఒక బీజేపీ సభ్యునికి అవకాశం కల్పించారు.
AP Govt | మరో 4 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ఏపీ సర్కార్
-