ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గజ్జెల లక్ష్మి(Gajjala Venkata Lakshmi)కి రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఆమెను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. గజ్జెల లక్ష్మి పదవి కాలం ఆగస్టు నెలతో ముగియడంతోనే ప్రభుత్వం ఈ మేరకు సంబంధిత శాఖకు జీవోను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు గజ్జల లక్ష్మీ ప్రటించారు. ఆమెకు సోమవారమే నోటీసులు చేరడంతో మంగళవారం ఆమె తన పదవి నుంచి తప్పుకున్నారు.
అయితే కాదంబరి జెత్వాని(Kadambari Jethwani) కేసు విషయంలో గజ్జల లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఉన్నత చదువులు చదివిన జెత్వాని.. ముందుగానే తమకు ఎందుకు ఆశ్రయించలేదని, బాధితురాలిపైనే విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా పక్క రాష్ట్రాల మహిళల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, ఆమె ముంబైకి చెందిన మహిళ కాబట్టి మహారాష్ట్ర మహిళ కమిషన్‌ను ఆశ్రయించాలని వెంకటలక్ష్మి(Gajjala Venkata Lakshmi) సలహా ఇవ్వడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై టీడీపీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.