పెట్టుబడులు పెంచేలా నూతన మద్యం పాలసీ: నాదెండ్ల మనోహర్

-

ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీని ప్రజలతో పాటు రాష్ట్రానికి మేలు చేకూర్చేలా రూపొందించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అందుకోసమే అధ్యయనం చేసిన రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని తెలిపారు. ‘‘మాకున్న అవగాహనతో కొత్త మద్యం పాలసీ రూపాకల్పనలో సహకరించాం. దీనికి ముందు మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రితో సమావేశమై చర్చించడం జరిగింది. రేపు కేబినెట్ ముందు నూతన లిక్కర్ పాలసీ ప్రపోజల్స్ ను పెడతాం. గత ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీతో జేబులు నింపుకోవడానికి ప్రయత్నించింది. విచిత్రంగా ఇష్టం వచ్చిన విధంగా ధరలు పెంచుకుంటూ పోయారు. గత ప్రభుత్వంలో మద్యం రేట్ల విషయంలో ఒకేరోజు జీవో నెంబర్ 128, జీవో నెంబర్ 129 పేర్లతో రెండు జీవోలు జారీ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొత్తగా తీసుకొస్తున్న మద్యం విధానం వల్ల మార్పు కనిపిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జాగ్రత్తగా స్టడీ చేశాం. ఎన్ఫోర్స్మెంటును బలోపేతం చేస్తాం. డి అడిక్షన్ సెంటర్లు, కౌన్సిలింగ్ సెంటర్లకు నిధులు కేటాయిస్తాం. నూతన మధ్య విధానంతో రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పిన జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. సర్వీస్ ఇండస్ట్రీ, టూరిజం డిపార్ట్మెంట్ను బలోపేతం చేసేలా నూతన పాలసీ. వినియోగదారునికి వెసులబాటు కల్పిస్తూ క్వాలిటీ మద్యం అందించడం జరుగుతుంది. ప్రీమియం అవుట్ లెట్స్ పెట్టడం జరుగుతుంది. టాక్స్ స్ట్రక్చర్ ను సులభతరం చేసేలా చర్యలు తీసుకోవడం జరిగింది’’ అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...