వైసీపీ సర్కార్ ప్రజల ఆరోగ్యానికి మంగళం పాడింది: మంత్రి సత్యకుమార్

-

వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి మంగళం పాడిందని, ఏకాడికి తమ జేబులు నింపుకోవడంపైనే వైసీపీ ఫోకస్ పెట్టిందంటూ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూనే ఉందని, సొంత బ్రాండ్లతో జేబులు నిండుతున్నాయో లేదో చూసుకుందే తప్ప.. ప్రజల దుస్థితి ఎలా ఉంది అని పట్టించుకున్న పాపాన వైసీపీ పోలీదంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారాయన. ‘‘గత ఐదేళ్లలో మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గత పాలకులు వారి జేబుల్లోకి నింపుకున్నారు. నాసిరకం మందుతో మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. వారి స్వలాభం కోసం వేలాది అక్కచెల్లమ్మల పుస్తెలతాడులు తెంపారు.

- Advertisement -

2014-2019లో రాష్ట్రంలో 36 వేల కిడ్నీ, కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు నమోదైతే.. 2019-2024లో రాష్ట్రంలో 56 వేలకు పైగా కిడ్నీ, కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు నమోదయ్యాయి. కూటమి ప్రభుత్వంలో నూతన లిక్కర్ పాలసీతో ఆరోగ్యానికి భద్రత కల్పించాలి. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకే అందించడం జరుగుతుంది. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ పేరుతో రూ.13 వేల కోట్లు అప్పు తెచ్చారు. వారి జేబులను నింపుకోవడం కోసం మందు బాబులు విషయంలో కూడా దోచేశారు. ఈ భారం కూడా ప్రస్తుత ప్రభుత్వం పై పడింది. నాణ్యమైన మద్యం, ప్రజల ఆరోగ్యం, పక్క రాష్ట్రాలతో పోటీపడేలా కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పన. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం నకిలీ మద్యం ద్వారా వచ్చే సమస్యలతో 2019లో ఆత్మహత్యలు 100% పెరిగాయి. ఇవి ఆత్మహత్యలు కాదు గత ప్రభుత్వ హత్యలు. ఈ మద్య విధానాన్ని రూపొందించిన గత పాలకులపై చర్యలు తీసుకోవాలి. ఈ పరిస్థితులను చక్కదిద్దుతూ దేశంలోని బెస్ట్ పాలసీని ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్‌పై ప్రభుత్వం క్లారిటీ

తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల(Family Digital Cards) దరఖాస్తు కోసం ప్రభుత్వం...

‘ఆ విజయం మనకు స్ఫూర్తి’.. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్న అమిత్ షా

మావోయిస్టు తీవ్రవాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) కీలక...