టీడీపీ ఆఫీసుపై కేసులో అప్పటివరకు చర్యలొద్దన్న హైకోర్టు

-

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న జరిగిన దాడి జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ అంశం కాస్తా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సజ్జల సహా ఐదుగురి పేర్లను పోలీసులు ప్రధాన నిందుతుల జాబితాలో ఉంచారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో నిందుతులుగా ఉన్న వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి అంతా హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశారు. వారి పిటిషన్ స్వీకరించి విచారణ జరిపిన న్యాయంస్థానం తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. అంతేకాకుండా అప్పటి వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Interview Tips | ఇంటర్వ్యూ కోసం ఇలా సిద్ధం కండి

Interview Tips | ఇంటర్వ్యూకు ముందు: చేయాల్సినవి (Do’s): •అదనపు రెజ్యూమేలు తీసుకెళ్లండి. •కంపెనీ గురించి...

Sheikh Hasina | బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకి బిగుస్తున్న ఉచ్చు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) కి మరో షాక్...