అమరావతి(Amaravati)లో బయట ప్రాంత వ్యక్తులకు భూమి పంపకాలు చేపడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని ప్రాంతం బయట ఉన్న వ్యక్తులకు భూమిని కేటాయిస్తూ ఆర్-5జోన్ పేరుతో ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. ఈ జీవోపై అమరావతి(Amaravati) రైతులు హైకోర్టును ఆశ్రయించారు. అమరాతి భూములను కేవలం రాజధాని అవసరాల కోసమే వాడాలని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును రైతుల తరపు న్యాయవాదులు హైకోర్టుకు గుర్తుచేశారు. హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని వాదించారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. అయితే ప్రభుత్వం, సీఆర్డీఏకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 19కు వాయిదా వేసింది.
Read Also: ట్విట్టర్ లోగో మారింది.. పిట్ట స్థానంలో కుక్క వచ్చిందోచ్
Follow us on: Google News, Koo, Twitter