Home Minister Anitha | మాజీ ఎంపీ గోరంట్లకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ కౌంటర్

-

మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ కు ఏపీ హోం మంత్రి అనిత(Home Minister Anitha) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం పై ఆయన చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. వైసీపీ నేతలు వారి పార్టీలో జరగబోయే  అంతర్యుద్ధం గురించి చర్చించుకోవాలని హితవుపలికారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసిన చట్టప్రకారం చర్యలు తప్పవని మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి పదజాలం వాడినా ఊరుకునేది లేదని.. ఇప్పుడు ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదని.. ఎన్డీఏ ప్రభుత్వం అని అన్నారు.

- Advertisement -

ఈ ప్రభుత్వంలో తప్పు ఎవరు చేసిన శిక్ష ఒకేలా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత గోరంట్ల మాధవ్(Gorantla Madhav) వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూటమి నేతలు అనంతపురం ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరు ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) పై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. వాక్ స్వాతంత్య్రం ఉందని ఏది పడితే అది మాట్లాడతాం అంటే కుదరదని మంత్రి అన్నారు. రాజ్యంగంలో మాట్లాడే స్వేచ్ఛ ఉందని..  ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేసారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది అన్న వ్యాఖ్యలను ఖండించారు. అదేవిధంగా తప్పు చేసిన వారికి శిక్ష పడాలని.. విడిచిపెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే అసభ్య పదజాలం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పోసాని అంగీకరించారు.  దీనిపై స్పందించిన మంత్రి(Home Minister Anitha) ఎవరు స్క్రిప్ట్ ఇచ్చినా శిక్ష అనుభవించేది  మాత్రం ఈ రాజానే కదా అన్నారు.

Read Also: దానిమ్మతో గంపెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటంటే..! 
Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై సస్పెన్షన్ వేటు..!

ఎమ్మెల్యే తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్...

Pomegranate | దానిమ్మతో గంపెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటంటే..!

దానిమ్మ పండు(Pomegranate).. ఇవి చాలా ఫేమస్. రక్తం పట్టాలన్నా, ఆరోగ్య సమస్యలతో...