ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

-

AP Inter Results |ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరవ్ గౌరవ్ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి వెల్లడించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం విద్యార్థులు bie.ap.gov.in, bieap.apcfss.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఇంటర్ ఫస్టియర్‌ విభాగంలో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 81 శాతంతో గుంటూరు, 79 శాతం ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక సెకండియర్ ఫలితాల్లోనూ 90 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా తొలి స్థానంలో నిలవగా.. 87 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. ఈసారి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు.

AP Inter Results | ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులు, మార్చి 2 నుంచి 20 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, సెకండియర్ పరీక్షలకు 5,35,865 మంది విద్యార్దులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన 22 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించడం విశేషం.

Read Also: మోసానికే జగన్ బ్రాండ్ అంబాసిడర్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...