Ambati Rambabu | పవన్ కల్యాణ్ బ్రో సినిమాపై మంత్రి అంబటి మరో ట్వీట్

-

Ambati Rambabu – BRO | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. నెగిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల విషయంలో సునామీ సృష్టించింది. ఏకంగా మూడ్రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమా రాజకీయ వివాదాలకు దారి తీసింది.

- Advertisement -

ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో పబ్‌లో ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ చేసిన డ్యాన్స్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) చేసిన డ్యాన్స్ లాగా ఉందని వైసీపీ శ్రేణులు, మంత్రి అభిమానులు బ్రో చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే స్పందించిన మంత్రి పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా.. మరోసారి బ్రో సినిమాపై, పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు. ప్యాకేజీ స్టార్‌కి పాకెట్ ఫుల్లు’’ అంటూ ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్‌కు, చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌కు ట్యాగ్ చేశారు. మరోపక్క మంత్రి ట్వీట్‌కు స్పందించిన జనసైనికులు.. ‘‘రాంబాబు క్యారెక్టర్‌లో శ్యాం బాబు.. జనాలు నవ్వుతున్నార్రా రాంబాబు.. బ్రో సినిమాకు మూడు రోజుల 100 కోట్లు.. వైఎస్ఆర్సీపీ గుండెల్లో పోట్లు’’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read Also: TS సర్కార్ గుడ్ న్యూస్.. టెట్ నోటిఫికేషన్ రిలీజ్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh)...

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...