వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) మరోసారి సీబీఐకు లేఖ రాశారు. తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రి ఉందని, ప్రస్తుతం తాను తల్లికి అండగా నిలబడాల్సి ఉందని లేఖలో ప్రస్తావించారు. ఈ పరిణామాల నేపథ్యంతో విచారణకు మరికొంత సమయం కావాలని ఈనెల 27 వరకు విచారణకు గడువు ఇవ్వాలని సీబీఐను కోరారు. ఈనెల 27 తర్వాత ఏ రోజు అయినా విచారణకు హాజరవుతానని తెలిపారు. అంతేకాదు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్(Anticipatory Bail) పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుందని లేఖలో ప్రస్తావించారు. అయితే ఈ లేఖపై సీబీఐ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాశ్ రెడ్డి(Avinash Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించేందుకు వెకేషన్ బెంచ్ నిరాకరించింది.
Read Also: సీబీఐ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది: టీడీపీ నేతలు
Follow us on: Google News, Koo, Twitter