జనసేన-టీడీపీ పొత్తుపై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ రాజకీయాలపై ప్రముఖ సినీ నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్(Bandla Ganesh) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఢిల్లీలో అమిత్ షా(Amit Shah), జేపీ నడ్డాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీపై బండ్ల గణేశ్ స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై పరోక్షంగా విమర్శలు చేశారు.

- Advertisement -

‘కర్మ కాకపోతే ఇంకేంటి. ఆయన సీపీఎం అంటే సీపీఎం అనాలి. ఆయన బీజేపీ అంటే బీజేపీ అనాలి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి. జనసేన అంటే జనసేన అనాలి. ఆయన కన్వీనియెంట్ గా ఏ పేరు చెప్తే దాన్ని అందరూ ఫాలో అవ్వాలి. అంతేగాని ఎవరికి ఆత్మాభిమానం, మంచి చెడు, మానవత్వం ఉండదు. ఆయన పొగిడితే జాతిని పొగిడినట్టు. లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టు. ఇంతకంటే ఏం కావాలి, దరిద్రం’ అంటూ బండ్ల గణేశ్(Bandla Ganesh) ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను పలువురు స్వాగతిస్తుంటే అటు టీడీపీ ఇటు బీజేపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తున్నారు.

Read Also:
1. కర్ణాటకలో బీజేపీని ఓడించలేదు.. తుడిచిపెట్టేశాం: రాహుల్ గాంధీ

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...