ఏపీ రాజకీయాల్లో నేడు ఏం జరగనుంది. సంచలన వార్త ఏమైనా వినడపనుందా? ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లునుందా? వీటికి సమాధానం తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రమంతా ఇప్పుడు ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఓటమితో అధికార పార్టీ కాస్త డీలాపడింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం.. వెంటనే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో పార్టీలో అసంతృప్తి గళం ఎక్కువుతోంది. దీంతో అంసతృప్తులకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్(CM Jagan) ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలో నేడు పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఎమ్మెల్యేల పనితీరు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమాలపై కూడా సమీక్షించనున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరు ఏవిధంగా ఉందో జగన్ వివరించనున్నారు. ఈ నివేదికల ఆధారంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఇస్తామో లేదే ఎమ్మెల్యేలకు స్పష్టం చేయనున్నారు. తనపై నమ్మకం ఉన్నవాళ్లు ఉండండి.. లేని వాళ్లు వెళ్లిపోండని కరాఖండిగా చెప్పనున్నట్లు వైసీపీ వర్గాల నుంచి తెలుస్తోంది.
అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా రావడం.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ(TDP) పుంజుకోవడంతో సీఎం జగన్(CM Jagan) తన వ్యూహాలకు పదును పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రాక ముందే ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే గవర్నర్ తో భేటీ అయి వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీ వెళ్లీ ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసి వచ్చారు. ముందస్తు ఎన్నికలపై వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలతో నేటి సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో బిగ్ డే కానుందని చెబుతున్నారు. సమావేశం అనంతరం జగన్ పెద్ద నిర్ణయమే వెల్లడించనున్నట్లు పేర్కొంటున్నారు. మరి ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో కాసేపట్లో తేలనుంది.
Read Also: చాణక్య నీతి: భార్యను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?
Follow us on: Google News, Koo, Twitter