జగన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. కాషాయ పెయింట్‌తో బీజేవైఎం ఆందోళన

-

తిరుమల లడ్డూ(TTD Laddu) ప్రసాద కల్తీ అంశంపై తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ అంశానికి నిరసనగానే బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తాడెపల్లి ఇంటి ముందు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న వైసీపీ కార్యాలయంలోకి చొరబడటానికి కూడా ప్రయత్నించారు. కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆటలాడుకున్న జగన్.. వారికి క్షమాపణలు చెప్పాలంటూ జగన్ ఇంటి ముందే బైఠాయించి డిమాండ్ చేశారు. అదే విధంగా వైవీ సుబ్బారెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరకున్ని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితులు మరింత హీటెక్కాయి. భద్రతా సిబ్బంది, పోలీసులకు బీజేవైఎం కార్యకర్తలకు మధ్యా వాగ్వాదం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఎట్టకేలకు ఆందోళలను సర్దుమనిగించిన పోలీసులు.. పలువురు బీజేవైఎం కార్యకర్తలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

- Advertisement -

TTD Laddu | కాగా ఇదంతా కూడా చంద్రబాబు కనసన్నల్లోనే జరుగుతుందని, తన పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు ఇలా చేస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. తిరుమలలో కల్తీ నెయ్యిని చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలోనే పట్టుకున్నారని, కానీ దానిని ఎటువంటి సంబంధం లేని వైసీపీ నెత్తిన రుద్ది.. తమ పార్టీ, నేతలపై బురదజల్లడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

Read Also: అన్నవరం ఆలయంలో తనిఖీలు.. అంతా పురుగుల మయం..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...