Botsa Satyanarayana | తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ(Botsa Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీని తెలంగాణతో పోల్చడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితి అక్కడ ఉందని ఎద్దేవా చేశారు. పేపర్ లీకేజీ స్కామ్‌లు సహా అన్నిటినీ గమనిస్తూనే ఉన్నామని తెలిపారు. తెలంగాణలో నిర్వహించే పరీక్షలన్నీ చూచిరాతలే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఎంతమంది అరెస్టు అవుతున్నారో వార్తలు వస్తూనే ఉన్నాయని బొత్స(Botsa Satyanarayana) విమర్శించారు. తెలంగాణలో టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. అందుకే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రం తో పోల్చకూడదన్నారు. ఎవరి ఆలోచన వారిది ఎవరి విధానం వారిదన్నారు. తాజాగా.. బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు స్పందించారు. ఈ సందర్భంగా బొత్స వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), గంగుల కమలాకర్‌(Gangula Kamalakar)లు ఘాటుగా స్పందించారు.

Read Also: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...