వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ చేపట్టిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి విచారణ ముగిసింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన విచారణ దాదాపు 7గంటలపాటు కొనసాగింది. హత్యకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగిన అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. హత్య జరిగిన రోజు అర్ధరాత్రి ఎవరెవరితో అవినాశ్ వాట్సాప్ కాల్స్, ఛాటింగ్ చేశారనే విషయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
విచారణ ముగియడంతో సీబీఐ కార్యాలయం నుంచి అవినాశ్ హైదరాబాద్‌లోని తన ఇంటికి వెళ్లిపోయారు. మరింత విచారణ కోసం వచ్చే శనివారం అవినాశ్ రెడ్డిని పూర్తి స్థాయిలో అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా మే 31న అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.