జబర్దస్త్‌ పంచ్‌ ప్రసాద్‌ ఆరోగ్యం విషమం.. సహాయం కోసం విజ్ఞప్తి

జబర్దస్త్ షో ద్వారా తన స్కిట్‌లతో అభిమానులను నవ్వించిన పంచ్ ప్రసాద్ నిజజీవితంలో ఆ నవ్వులు లేకుండా పోతున్నాయి. కష్టాలు.. కన్నీళ్లతో జీవితం నెట్టుకొస్తున్నారు. కొంత కాలంగా కిడ్నీ సమస్యతో ప్రసాద్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పలువురు దాతలు ముందుకు వచ్చి ఆయనకు సహాయం అందించారు. రెగ్యూలర్‌గా డయాలసీస్ చేయించుకున్నప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగపడలేదు.

ప్రస్తుతం అతడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని జబర్ధస్త్ నటుడు నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తమ సహనటుడు పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. ఆయన రెండు కిడ్నీలు పాడైపోయాయని.. వెంటనే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాలని తెలిపారు. అందుకు చాలా ఖర్చు అవుతుందని దాతలు పెద్ద మనసు చేసుకొని సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here