‘సాలరీలో కొంత భాగం రైలు బాధిత కుటుంబాలకు ఇవ్వండి’

-

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) జరిగి.. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు స్పందిస్తూ సంతాపం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రమాదంపై రైల్వేశాఖ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సిగ్నల్‌ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని వెల్లడించింది. లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్‌ను కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడం వల్లే మొదట ప్రమాదం జరిగిందని తెలిపింది. ఇదిలా ఉందగా.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ(Varun Gandhi) తోటీ ఎంపీలకు ఓ పిలుపునిచ్చారు. రైలు ప్రమాద బాధిత కుటంబాలకు తమ జీతంలోని కొంత భాగాన్ని అందజేయాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం హృదయ విదారకరమని.. మన జీతంలో కొంత భాగాన్ని వారికి ఇవ్వడం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకోవాలని నా తోటి ఎంపీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాని తెలిపారు. వాళ్లకి ముందు మద్దతు ఇవ్వాలని ఆపై న్యాయం జరగాలని కోరారు.

Read Also:
1. నేనూ క్యాన్సర్ బారిన పడ్డాను: మెగాస్టార్ చిరంజీవి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీఆర్‌ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వరంగల్ మేయర్

లోక్ సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి....

ఒకప్పటి ప్రత్యర్థి కోసం మద్దతుగా చంద్రబాబు ప్రచారం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి నిదర్శనంగా చంద్రబాబు,...