జగన్ సర్కార్ కి షాక్.. చంద్రబాబు, లోకేశ్ భద్రతపై కేంద్రం ఫోకస్!

-

ఏపీలో కొద్దిరోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ పాదయాత్రలో జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఓవైపు లోకేశ్ పాదయాత్రకు జనం నీరాజనం పట్టడం.. మరోవైపు చంద్రబాబు పర్యటనలకు భారీగా ప్రజలు వస్తున్నారు. అయితే వీరి పర్యటనలు విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. అందులోనూ జడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ ఉన్నా.. చంద్రబాబు పర్యటనల్లో దాడులు ఎక్కువైపోతున్నాయి.

- Advertisement -

మొన్న పులివెందులలో, ఇవాళ పుంగనూరులో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు కాన్వాయ్‌పై కూడా రాళ్ల దాడికి దిగుతున్నారు. ఈ దాడుల వ్యవహారంపై కేంద్ర హోం శాఖకు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఫిర్యాదుచేశారు. దీనిపై తాజాగా కేంద్ర హోం శాఖ స్పందించింది. చంద్రబాబు, లోకేశ్ పర్యటనలకు కల్పించిన భద్రత వివరాలపై నివేదిక కోరింది. చంద్రబాబు, లోకేశ్‌లకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలని డీజీపీ, సీఎస్‌లను ఆదేశాలు జారీచేసింది. అలాగే గతేడాది నవంబర్ 4న నందిగామలో చంద్రబాబు ర్యాలీలో జరిగిన రాళ్ల దాడిపై కూడా నివేదిక ఇవ్వాలని కోరింది. జులై 27న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...