చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడి.. డీజీపీకి చేరిన క్లిప్పింగ్స్

-

పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్‌తో పాటు టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తల రాళ్లదాడిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దాడులకు పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

పుంగనూరులో చోటుచేసుకున్న ఘటనపై డీజీపీకి టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య లేఖ రాశారు. లేఖతో పాటు ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్, గాయాలపాలైన టీడీపీ కార్యకర్తల ఫోటోలను పంపించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారన్నారు. పెద్దిరెడ్డి ప్రోద్బలంతో టీడీపీ ఫ్లెక్సీలు సైతం తొలగించారన్నారు. గతంలో కూడా నందిగామ, ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. శాంతి భద్రతలకు నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పుంగనూరులో చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడికి నిరసనగా అరకు లోయలో టీడీపీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హోంమంత్రి వనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అరకులోయ నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముకొస్తున్నారని.. మంత్రి పెద్దిరెడ్డి పతనం ప్రారంభమైందని కిడారి శ్రావణ్ హెచ్చరించారు.

చంద్రబాబుపై పుంగనూరులో జరిగిన దాడికి నిరసనగా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో టిడిపి శ్రేణులు నిరసనకు దిగారు. అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి దౌర్జన్యాలు నశించాలని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. చంద్రబాబుపై దాడికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...