Amaravati Railway Line | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఎర్రుపాలెం(Errupalem) నుంచి నంబూరు(Namburu) వరకు దాదాపు 56 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైల్వే లైన్‌కు భూసేకరణను కూడా ప్రారంభించింది. ఈ భూసేకరణలో భాగంగా అమరావతికి వేసే రైల్వే లైన్ కోసం తెలంగాణలో భూసేకరణ చేపట్టింది.
Amaravati Railway Line | అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించడానికి ఖమ్మం జిల్లా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ను కాంపిటెంట్ అథారిటీగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని రెండు మండలాల్లో రైల్వే లైన్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఈ అధికారి పర్యవేక్షిస్తారు. అన్ని పనులు సరైన సమయానికి పూర్తయ్యేలా చూడటం ఈ ప్రధాన బాధ్యత కానుంది. దాంతో పాటుగా పనుల నాణ్యత బాధ్యత కూడా ఆయనే తీసుకోనున్నట్లు సమాచారం.